ఏపీలో ఈ ప్రాంతాలలో భారీ వర్షాలు

నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ప్రభావంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీగా వర్షాలు పడుతున్నాయి. ముఖ్యముగా ఏపీలో ఉపరితల ఆవర్తనం ప్రభావం ఎక్కువగా ఉండడంతో భారీ నుండి అతి భారీ వర్షాలు కురవనున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. రానున్న మూడు రోజులు ఏపీలో పలు చోట్ల మోస్తరు నుండి భారీ వర్షాలు పడనున్నట్లు తెలిపింది.
ఉత్తర కోస్తాంధ్ర, యానాంలలో శని, ఆది, సోమవారాల్లో తేలిక పాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు మరి కొన్ని చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. దక్షిణ కోస్తాంధ్రలో ఆదివారం వరకు తేలిక పాటి నుంచి మోస్తరు వర్షాలు కురవనున్నాయని , రాయసీమలోనూ తేలిక పాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం వాతావరణ శాఖ పేర్కొంది.
ఇక తెలంగాణ విషయానికి వస్తే..ఈ నెల 17 వరకు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. శనివారం ఆదిలాబాద్, నిజామాబాద్, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, వరంగల్, జనగామ, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్‌నగర్, నారాయణపేట జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని ప్రాథమిక హెచ్చరిక జారీ చేసింది.