ఎమ్మెల్సీ పదవికి రాజీనామా

అనారోగ్య కారణాలే కారణం: ‘డొక్కా’
వెల్లడి

DOKKA MANIKHYA VARA PRASAD
DOKKA MANIKHYA VARA PRASAD

అమరావతి: ఎమ్మెల్సీ డొక్కా మాణిక్య వరప్రసాద్, తన పదవికి రాజీనామా చేశారు. మండలిలో అధిక సంఖ్యా బలం ఉన్న టిడిపి,మూడు రాజధానుల బిల్లును ఎలాగైనా అడ్డుకోవాలన్న ఉద్దేశంతో సభ్యులంతా హాజరు కావాలని విప్ జారీ చేసిన వేళ, నేటి సభకు డొక్కా గైర్హాజరయ్యారు. ఇదే సమయంలో తన పదవికి రాజీనామా చేస్తున్నానని, అనారోగ్య కారణాలతోనే ఈ నిర్ణయం తీసుకున్నానని ఆయన తన రాజీనామా లేఖలో పేర్కొన్నట్టు తెలుస్తోంది. డొక్కా వైఖరిపై ప్రస్తుతం తెలుగుదేశం పార్టీలో తీవ్ర చర్చ జరుగుతోంది. కాగా ఆయన టిడిపి సభ్యత్వానికి కూడా రాజీనామా చేశారా? అన్న విషయమై స్పష్టత లేదు. డొక్కా రాజీనామాపై మరిన్ని వివరాలు తెలియాల్సివుంది.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/