గుజరాత్ లో ముగిసిన రెండో దశ పోలింగ్

గుజరాత్ లో రెండో దశ పోలింగ్ ప్రశాంతంగా ముగిసాయి. మొత్తం 93 అసెంబ్లీ స్థానాల్లో పోలింగ్ జరిగాయి. ఉదయం 8 గంటలకు ప్రారంభమై సాయంత్రం 5 గంటలకు పోలింగ్ ముగిసింది. రెండవ దశలో మొత్తం 2.54 కోట్ల ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకున్నారు. రెండు విడతలుగా గుజరాత్ ఎన్నికలు జరగగా..మొదటి దశలో 89 స్థానాలకు..రెండో దశలో 93 స్థానాలకు పోలింగ్ జరిగింది. మొత్తం 833 మంది అభ్యర్థులు తమ భవితవ్యం ఈ ఎన్నికలతో ముడిపడి ఉంది. ప్రధానంగా బీజేపీ, కాంగ్రెస్, ఆప్ మధ్య పోరు నెలకొంది. డిసెంబరు 1న జరిగిన తొలి దశ పోలింగ్ లో 89 స్థానాలకు ఓటింగ్ నిర్వహించారు. ఈ రెండు దశలకు కలిపి డిసెంబరు 8న ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలు వెల్లడించనున్నారు.

కాగా, రెండో దశ పోలింగ్ లో ప్రధాని నరేంద్ర మోదీ కూడా ఓటు హక్కు వినియోగించుకున్నారు. అంతేకాదు, పలువురు ప్రముఖుల భవితవ్యం ఈ రెండో దశ పోలింగ్ నిర్ణయించనుంది. గుజరాత్ సీఎం భూపేంద్ర పటేల్ (ఘట్లోడియా), పాటిదార్ ఉద్యమకారుడు హార్దిక్ పటేల్ (విరామ్ గమ్), ఓబీసీ నేత అల్పేష్ ఠాకూర్ (గాంధీ నగర్ సౌత్), జిగ్నేశ్ మేవానీ (వడ్గామ్) తదితరుల నియోజకవర్గాలకు నేడు పోలింగ్ జరిగింది.