రైతుల పరిస్థితి తలుచుకుంటే బాధేస్తోంది

Nara Lokesh
Nara Lokesh

అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌గారి చెత్త నిర్ణయాలతో రైతులు బలైపోతున్నారని టిడిపి ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ మండిపడ్డారు. ఈ మేరకు ఆయన ట్వీట్‌ చేశారు. ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించే భూమిని రాజధాని కోసం త్యాగం చేసిన రైతుల పరిస్థితి తలుచుకుంటే బాదేస్తుందన్నారు. కృష్ణాయపాలెంలో ఆందోళనతో రైతు కృపానందం మృది చెందడం నన్ను తీవ్రంగా కలచివేసిందని నారా లోకేష్‌ ఆవేదన వ్యక్తం చేశారు. ఇంకా మరో ట్విట్‌లో వెఎస్‌ఆర్‌సిపి నాయకులు రైతులను అవమానిస్తూ, కించపరుస్తూ మాట్లాడుతున్న మాటలు రైతులను మానసికంగా ఆందోళనకు గురిచేస్తున్నాయని, ముర్ఖంగా వ్యవహరించకుండా రాజధాని పై ప్రభుత్వం పునరాలోచించడం మంచిదని నారా లోకేష్‌ హితవు పలికారు.

తాజా క్రీడా వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/sports/