అనంతపురం జిల్లాలో రోడ్డు ప్రమాదం…ముగ్గురు మృతి

అనంతపురం: అనంతపురం జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు మృతి చెందారు. మరో ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. పెద్దవడుగూరు మండలం మిడుతూరు వద్ద బెంగళూరు నుంచి హైదరాబాద్ వెళ్తున్న బస్సు ఆగి వున్న లారీని ఢీకొట్టింది. ఈ ఘటనలో బస్సు డ్రైవర్ జీ వి రెడ్డి, ఐచర్ వాహనం డ్రైవర్ శకత్ రామ్ యాదవ్ లు మృతి చెందగా మరో ఏడు మంది తీవ్రంగా గాయపడ్డాడు. బస్సు ప్రయాణికులు హైదరాబాద్ కు చెందిన వెంకటరామయ్య అబ్దుల్ రహీం పాండు బెంగళూరుకు చెందిన భరత్ వంశీ, కర్నూలుకు చెందిన చంద్రకళాధర్ లు గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను అనంతపురంలోని ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/national/