ప్రకాశం జిల్లాలో ప్రమాదానికి గురైన ప్రైవేటు బస్సు …

ఏపీలో వరుస బస్సు ప్రమాదాలు ప్రయాణికులను ఆందోళనకు గురి చేస్తున్నాయి. బుధువారం జంగారెడ్డి గూడెం లో వాగులో ఆర్టీసీ బస్సు పడిన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదం లో 9 మంది మృతి చెందారు. ఈ ఘటన తెలుగు రాష్ట్రాల్లో భయాందోళనకు గురి చేయగా..గురువారం ప్రకాశం జిల్లాలో ప్రవైట్ బస్సు ప్రమాదానికి గురైంది.

ప్రకాశం జిల్లా పర్చూరు మండలం తిమ్మరాజుపాలెం వద్ద ఓ ప్రైవేట్‌ బస్సులో మంటలు చెలరేగాయి. ఈ క్రమంలో మంటల ధాటికి బస్సు పూర్తిగా దగ్ధమైంది. అప్రమత్తమైన ప్రయాణికులు వెంటనే బస్సు నుంచి బయటకి దూకి ప్రాణాలు కాపాడుకున్నారు. అయితే ప్రయాణికుల సామగ్రి మంటల్లో దగ్ధమైంది. బస్సు హైదరాబాద్‌ నుంచి చీరాల వస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది.