ఇరాన్‌ అణుకర్మాగారం వద్ద భూకంపం

Iran-nuclear-power-plant
Iran-nuclear-power-plant

టెహ్రాన్‌: ఇరాన్‌ అణుకేంద్రం సమీపంలో ఈరోజు ఉదయం భూకంపం సంభవించింది. రిక్టార్ స్కేలుపై భూకంప తీవ్రత 4.9గా నమోదైంది. ఇరాన్‌లోని బోరాజాన్‌కు ఆగ్నేయ దిశగా పది కిలోమీటర్ల లోతున భూకంపం కేంద్రీకృతమై ఉన్నట్టు అమెరికా జియోలాజికల్ సర్వే వెల్లడించింది. బుషెహర్‌కు 70 కిలోమీటర్ల దూరంలో బోరాజాన్ ఉంది. కాగా భూకంపం కారణంగా జరిగిన నష్టంపై ఇంకా సమాచారం లేదు. కాగా రాక్‌లో్ని అమెరికా సైనిక స్థావరాలపై ఇరాన్ క్షిపణి దాడులకు దిగుతున్న నేపథ్యంలో మధ్య ప్రాచ్యంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ సమయంలోనే భూకంపం చోటుచేసుకోవడంతో స్థానికులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు.

తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/