రేపు తిరుపతి, నాగార్జున సాగర్ ఉప ఎన్నిక ఫలితాలు

కౌంటింగ్ కు ఏర్పాట్లు పూర్తి

by-election results tomorrow
by-election results tomorrow

Hyderabad/ Amaravati: తిరుపతి, నాగార్జున సాగర్ ఉప ఎన్నికల పోలింగ్ ఓట్ల లెక్కింపు ఆదివారం జరగనుంది. అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. తిరుపతి లోక్ సభ స్థానానికి సంబంధించిన ఎస్వీ ఆర్ట్స్ కాలేజీలో జరగనుంది. కౌంటింగ్ అధికారులకు, ఏజెంట్లకు ముందుగానే కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. నెగెటివ్ వచ్చినవారినే కౌంటింగ్ లోకి అనుమతించనున్నారు. ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభానికి కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసారు. మొదట పోస్టల్ బాలెట్ ఓట్లు, తర్వాత ఇవిఎం ఓట్లను లెక్కిస్తారు. తిరుపతి నియోజక వర్గానికి సంబంధించి 4 కౌంటింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. మధ్యాహ్నం లోగా ఫలితాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.

తాజా ఎన్నారై వార్తల కోసం : https://www.vaartha.com/news/nri/