లాక్‌డౌన్‌ సరిగా అమలు కావడంలేదు

బిజెపి ఎమ్మెల్యే రాజాసింగ్‌

rajasingh
rajasingh

హైదరాబాద్‌: హైదరాబాద్‌లోని పాతబస్తీలో ముస్లింలు లాక్‌డౌన్‌ పాటించడం లేదని బిజెజి ఎమ్మెల్యే రాజాసింగ్‌ అన్నారు. రంజాన్‌ పేరు చెప్పి వందల మంది ముస్లింలు రోడ్లమీదకు వస్తున్నారన్నారు. హైదరాబాద్‌లోని ఎంజే మార్కెట్‌, ఉస్మాన్‌గంజ్‌ ప్రాంతాల్లో లాక్‌డౌన్‌ అమలు కావడం లేదని అన్నారు. ఇదిలా ఉండగా తెలంగాణలో ఉగాది, శ్రీరామనవమి, హనుమాన్‌ జయంతి వంటి పండుగలను హిందువులు ఇళ్లలోనే జరుపుకున్నారని గుర్తుచేశారు. ముస్లింలు బయటకు వచ్చేందుకు అనుమతి ఎలా ఇస్తున్నారని ప్రశ్నించారు. ఇప్పటికే గోషామహల్‌ ప్రాంతంలో కరోనా కేసులు భారీగా పెరుగుతున్న నేపథ్యంలో లాక్‌డౌన్‌ ను మరింత కఠినంగా అమలు చేయాలని డిజిపిని కోరుతున్నానన్నారు .

తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/international-news/