స్థానిక ఎన్నికల ప్రక్రియను రద్దు చేయండి

ఏపి బిజెపి అధ్యక్షుడు కన్నా

kanna laxmi narayana
kanna laxmi narayana

అమరావతి: ఏపిలో వైయస్‌ఆర్‌సిపి తీరుపై రాష్ట్ర గవర్నర్‌ బిశ్వ భూషన్‌ హరించందన్‌కు ఏపి బిజెపి అధ్యక్షుడు కన్నా లక్ష్మీ నారాయణ లేఖ రాశారు. రాష్ట్రంలో ఇప్పటికే ప్రారంభించిన స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియను పూర్తిగా రద్దు చేయాలని కోరారు. వైయస్‌ఆర్‌ సిపి దాడులు, దౌర్జన్యాలతో చాలా చోట్ల ఏకగ్రీవం చేసుకుందని ఆరోపించారు. రాష్ట్ర చరిత్రలో ఇలాంటి దౌర్జన్యాన్ని ఎన్నడు చూడలేదని, స్థానిక ఎన్నికల ప్రక్రియ మళ్లీ మొదటినుంచి నిర్వహించాలని ఆయన కోరారు. కాగా ఏపిలో కరోనా విజృంభన నేపథ్యంలో స్థానిక ఎన్నికలను ఈసి వాయిదా వేసింది.

తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/international-news/