ఎంత కాలం పని చేశాం అనేది కాదు.. ప్రజామోదం ముఖ్యం

జమ్మికుంట: నేడు ఈటల రాజేందర్ బీజేపీ జమ్మికుంట మండల శిక్షణ సమావేశంకు ముఖ్య అతిథిగా హాజ‌ర‌య్యారు. ఈసంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ… నాయ‌కుడు ఎప్పుడూ ప్ర‌జ‌ల మ‌ధ్య‌లోనే ఉండాల‌ని అన్నారు. ఎప్పుడూ ప్ర‌జ‌ల మ‌ధ్య ఉన్న నాయ‌కుల‌కే పార్టీ టికెట్ ఇస్తుందన్నారు. సర్వే చేసి ప్రజా బలం ఉన్నవారికే టికెట్స్ ఇస్తారన్నారు. ఎంత కాలం పని చేశాం అనేది కాదు.. ప్రజామోదం ముఖ్యమ‌న్నారు.

ప్రజానాయకుడు కావాలి అంటే.. కాలికి ముల్లు కుచ్చుకుంటే ముల్లుతో తీసినట్టు పని చేయాలన్నారు. ప్రజలే దేవుళ్ళు అనే భావన ఉండాలన్నారు. గెలిపించిన కార్యకర్తలను మర్చిపోతే మళ్లీ గెలవలేరన్నారు. మన క్షేత్రం గ్రామాలు.. నేలవిడిచి సాము చేయవద్దన్నారు. ఆ పూటకు ఓట్లు అడిగితే ప్రజలు ఓట్లు వెయ్యరన్నారు. పదవి మార్కెట్లో దొరికేది కాదు.. అమ్మ నాన్న ఇచ్చేది కాదు, కొనుక్కుంటే వచ్చేది కాదు.. అది ప్రజలు ఇచ్చేదన్నారు. ప్రజల్లో ఉందాం.. ప్రజావ్యతిరేక ప్రభుత్వ విధానాలను ఎండగడదామ‌న్నారు. కేసీఆర్ ఎన్ని జిమ్మిక్కులు చేసినా గెలిచేది బీజేపీ నే అని ఈట‌ల రాజేంద‌ర్ అన్నారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/telangana/