సర్కారు వారి దూకుడు తగ్గట్లే..18 రోజుల్లో ఎంతంటే..

సూపర్ స్టార్ మహేష్ బాబు , మహానటి ఫేమ్ కీర్తి సురేష్ జంటగా డైరెక్టర్ పరుశురాం డైరెక్ట్ చేసిన మూవీ సర్కారు వారి పాట. మే 12 న ప్రేక్షకుల ముందుకు వచ్చి హిట్ టాక్ సొంతం చేసుకుంది. విడుదలైన నాటి నుండి బాక్స్ ఆఫీస్ వద్ద డీసెంట్ కలెక్షన్లు రాబడుతూ వస్తున్న ఈ మూవీ..18 వ రోజు కూడా రెండు తెలుగు రాష్ట్రాల్లో హావ చూపించింది.

18వ రోజు .. నైజాంలో రూ. 30 లక్షలు, సీడెడ్‌లో రూ. 13 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 14 లక్షలు, ఈస్ట్‌లో రూ. 9 లక్షలు, వెస్ట్‌లో రూ. 4 లక్షలు, గుంటూరులో రూ. 2 లక్షలు, కృష్ణాలో రూ. 4 లక్షలు, నెల్లూరులో రూ. 3 లక్షలతో కలిపి ఆదివారం రూ. 79 లక్షలు షేర్, రూ. 1.30 కోట్లు గ్రాస్‌ రాబట్టగా.. మొత్తం 18 రోజుల్లో రూ. 89.10 కోట్లు షేర్, రూ. 134.50 కోట్లు గ్రాస్‌ రాబట్టి వార్తల్లో నిలిచింది. ప్రపంచ వ్యాప్తంగా రూ. 108.50 కోట్లు షేర్‌తో పాటు రూ. 174.75 కోట్ల గ్రాస్ సాధించింది. ఇక ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్, 14 రీల్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ సంస్థలతో కలిసి మహేశ్ స్వయంగా నిర్మించాడు. ఈ సినిమాకు థమన్ సంగీతాన్ని సమకూర్చాడు. ఇందులో సముద్రఖని విలన్ పాత్రను చేశారు.

ఇక ఇక మహేష్ తదుపరి చిత్రంపై అంతటా ఆసక్తి నెలకొంది. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో.. మహేష్ కెరీర్ లో 28వ చిత్రంగా విశేషాన్ని సంతరించుకుంది. ఈ చిత్రానికి ‘అర్జునుడు’ అనే పవర్‌ఫుల్ టైటిల్ ను ఖాయం చేయబోతున్నట్టు వార్తలొస్తున్నాయి. ఇక ఈ సినిమాకి సంబంధించిన ఓ వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ మూవీ లో మహేష్ ద్విపాత్రాభినయం చేయబోతున్నట్టు చెపుతున్నారు. ఇదో పీరియాడిక్ డ్రామా అని, ఫ్లాష్ బ్యాక్‌లోనూ, వర్తమానంలోనూ ఆ రెండు పాత్రలు కనిపిస్తాయని అంటున్నారు. మరి ఇది ఎంతవరకు నిజమో తెలియాల్సి ఉంది. ‌‌‘అతడు, ఖలేజా’ చిత్రాల తర్వాత మహేష్, త్రివిక్రమ్ కలయికలో రానున్న ఈ మూడో చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. వచ్చే సంక్రాంతికి చిత్రాన్ని విడుదల చేయాలని త్రివిక్రమ్ ప్లాన్.