జగన్ మూడేళ్ల పాలన గురించి నారా లోకేష్ ఏమన్నారో తెలుసా..?

Nara Lokesh explains Jagans 3 years rule

ఏపీలో జగన్ సర్కార్ అధికారంలోకి వచ్చి నేటికీ మూడేళ్లు పూర్తి చేసుకుంది. ఈ సందర్బంగా రాష్ట్ర వ్యాప్తంగా వైస్సార్సీపీ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నారు. ఈ తరుణంలో జగన్ పాలన ఫై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ మూడు మాటల్లో చెప్పేసారు.

జగన్ రెడ్డి గారి మూడేళ్ల పాలన మూడు మాటల్లో చెప్పాలంటే… విద్వేషం, విధ్వంసం, విషాదం అని ఆయన అన్నారు. ఈ మూడేళ్లలో సాధించింది శూన్యమని చెప్పారు. రాబోయే రెండేళ్లలో రాష్ట్రం సర్వనాశనం కావడం ఖాయమని అన్నారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. విద్వేషానికి సంబంధించి రామతీర్థంలో రాముని తల నరికవేతను, విధ్వంసానికి సంబంధించి ప్రజావేదిక కూల్చివేతను, విషాదానికి సంబంధించి ఎల్జీ పాలిమర్స్ విషాద ఘటనను ఆయన ఉదాహరించారు.

మరోవైపు సీఎం జగన్ మాత్రం మూడేళ్ల పాలన ఫై ట్విట్టర్ లో ఎమోషనల్ ట్వీట్ చేసారు. ‘మీరు చూపిన ప్రేమ‌, మీరు అందించిన ఆశీస్సుల‌తో ముఖ్య‌మంత్రిగా బాధ్య‌త‌లు చేప‌ట్టి మూడేళ్లు అవుతోంది. మీరు నాపై పెట్టుకున్న‌ న‌మ్మ‌కాన్ని నిల‌బెట్టుకుంటూ గ‌డిచిన మూడేళ్ల‌లో 95 శాతానికి పైగా హామీల‌ను అమ‌లు చేశాం. ఎన్నో మంచి ప‌నుల‌కు శ్రీ‌కారం చుట్టాం. రాబోయే రోజుల్లో మీకు మరింతగా సేవ చేస్తానని, మీ ప్రేమాభిమానాలు నాపై ఎప్పటికీ ఇలాగే ఉండాలని మ‌న‌స్పూర్తిగా కోరుకుంటున్నా. మీకు సేవ చేసే భాగ్యాన్ని నాకు కల్పించినందుకు మ‌రొక్క‌సారి అందరికీ కృత‌జ్ఞ‌త‌లు తెలియ‌జేసుకుంటున్నా’ అని ట్వీట్ చేశారు.