‘బండి’ దీక్ష‌కు బాబూమోహ‌న్, డికె అరుణ సంఘీభావం

ప్రధాని మోదీ కన్నెర్ర చేస్తే కేసీఆర్ జైల్లో ఉంటారు -బాబూ మోహన్ వ్యాఖ్య

Babu Mohan meets Bandi Sanjay
Babu Mohan meets BJP MP Bandi Sanjay Kumar

Karim Nagar:   సిద్దిపేట‌లో పోలీసుల చ‌ర్య‌ను నిర‌సిస్తూ బీజేపీ ఎంపీ, రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ క‌రీంన‌గ‌ర్ లోని త‌న కార్యాల‌యంలో గ‌త రాత్రి నుంచి దీక్ష ను కొన‌సాగిస్తున్నారు.

త‌న‌ను అరెస్ట్ చేసిన జిల్లా సిపిని వెంట‌నే స‌స్పెండ్ చేయాల‌ని కోరుతూ ఆయ‌న దీక్ష‌ను చేపట్టారు. మరోవైపు కరీంనగర్‌లో ఎంపీ కార్యాలయానికి ఎదురుగా కార్యకర్తలు, నేతలు దీక్ష‌కు మ‌ద్దతుగా నిరసనకు దిగారు.

కాగా, బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, మాజీ మంత్రి బాబు మోహన్ ‘బండి’ని పరామర్శించారు. సుమారు అరగంట పాటు ఎంపీతో జరిగిన విషయాలపై చర్చించారు.

అనంతరం మీడియాతో మాజీ మంత్రి బాబూ మోహన్ మాట్లాడుతూ, కేసీఆర్ సర్కార్ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు.

‘దుబ్బాకలో కనీస వసతులు లేవు. ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి హరీష్ రావు నియోజకవర్గాలు గజ్వేల్, సిద్దిపేట ఎలా ఉన్నాయి..? దుబ్బాక ఎలా ఉంది?. రఘునందన్ మీద కేసీఆర్ కుట్రలు పన్నుతున్నారు.

మామా అల్లుళ్ళ కుట్రలు పని చేయవు. ప్రధాని నరేంద్ర మోదీ కన్నెర్ర చేస్తే కేసీఆర్ జైల్లో ఉంటారు’ అని బాబూ మోహన్ వ్యాఖ్యానించారు.

తాజా కెరీర్‌ సమాచారం కోసం : https://www.vaartha.com/specials/career/