ఆచార్య కోసం రంగంలోకి హరీష్ శంకర్

harish shankar interview to acharya team

మెగాస్టార్ చిరంజీవి – కొరటాల శివ కలయికలో తెరకెక్కుతున్న మెగా మూవీ ఆచార్య. ఇక ఈ మూవీ లో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కీలక పాత్రలో నటిస్తుండగా.. కాజల్ , పూజా హగ్దే లు హీరోయిన్స్ గా నటిస్తున్నారు. చిత్ర ప్రమోషన్ లలో భాగంగా శనివారం యూసఫ్ గూడ లో చిత్ర ప్రీ రిలీజ్ వేడుక అట్టహాసంగా జరుగగా..ఈ వేడుకకు రాజమౌళి ముఖ్య అతిధిగా హాజరయ్యారు. ఇక సినిమా రిలీజ్ టైం దగ్గర పడుతుండడం తో చిత్ర ప్రమోషన్ ను సరికొత్తగా ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే దర్శకుడు , చరణ్ లతో పలు ఇంటర్వూస్ చేయగా..ఇప్పుడు ప్రముఖ దర్శకుడు హరీష్ శంకర్ చిత్ర యూనిట్ ను ఇంటర్వూస్ చేయబోతున్నారు.

ఈ విషయాన్ని ట్విట్టర్ వేదికగా ప్రకటించిన మేకర్స్..‘ఆచార్య’ విశేషాలను తెలుసుకునేందుకు మీ ప్రశ్నలు కూడా అడగొచ్చని చెప్పారు. అందుకు నెటిజన్లు కాని అభిమానులు కాని తమ ప్రశ్నలను పంపిస్తే చాలు.. వాటిని హరీశ్ శంకర్ ‘ఆచార్య’ టీమ్ మెంబర్స్ ను అడుగుతారు. #AskAcharyaTeam ఆస్క్ ఆచార్య టీమ్ హ్యాష్ ట్యాగ్ తో మీ క్వశ్చన్స్ ను పంపించాలి. ఈ ఇంటర్వ్యూలో ‘ఆచార్య’ టీమ్ మెంబర్స్ మెగాస్టార్ చిరంజీవి, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, సక్సెస్ ఫుల్ డైరెక్టర్ కొరటాల శివ పాల్గొననున్నారు. డైరెక్టర్ హరీశ్ శంకర్ ఇంటర్వ్యూ చేయబోతున్నారని తెలుసుకుని మెగా అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.