మందడంలో ఉద్రిక్త పరిస్థితులు

మహిళా రైతుల అరెస్టు.. పోలీసు వాహనం టైరు చేతిపైకి ఎక్కిన వైనం

Amaravati - farmers
Amaravati – farmers

అమరావతి: ఏపిలో మూడు రాజధానులపై కొన్ని రోజులుగా రైతులు ఆందోళన చేస్తోన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ రోజు మధ్యాహ్నం మందడంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కొందరు మహిళా రైతులను పోలీసులు అరెస్టు చేసి, అక్కడి నుంచి తరలించబోయారు. పోలీసుల తీరును నిరసిస్తూ గ్రామస్తులు ఎదురుతిరిగి, వాగ్వివాదానికి దిగారు. రైతులను పోలీసులు వాహనంలో ఎక్కిస్తుండగా అడ్డుపడ్డారు. దీంతో పోలీసు వాహనం టైరు చేతిపైకి ఎక్కడంతో ఓ రైతుకి గాయాలయ్యాయి. పోలీసుల తీరును సరిగాలేదంటూ పోలీసు వాహనానికి ఎదురుగా రైతులు పడుకున్నారు. దీంతో వారిని పోలీసులు అక్కడి నుంచి తొలగించే ప్రయత్నం చేస్తున్నారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/