పల్లె ప్రగతి చాలామంచి కార్యక్రమం: సీఎస్‌

ఈ కార్యక్రమం ద్వారా పల్లెలు అభివృద్ధి చెందుతాయి

somesh kumar
somesh kumar

హైదరాబాద్‌: పల్లె ప్రగతి చాలా మంచి కార్యక్రమమని తెలంగాణ సీఎస్‌ సోమేష్‌ కుమార్‌ అన్నారు. ఈ కార్యక్రమం ద్వారా పల్లెలు అభివృద్ధి చెందుతాయని అన్నారు. నేడు శాసనమండలి ఆవరణలో సీఎస్‌ మీడియాతో మాట్లాడుతూ..ఆరు నెలల్లో తెలంగాణ రాష్ట్రాన్ని సంపూర్ణ అక్షరాస్యత రాష్ట్రంగా మారుస్తామని సోమేష్‌ కుమార్‌ తెలిపారు. ఈ నేపథ్యంలో సచివాలయం తరలింపుపై కీలక వ్యాఖ్యలు చేశారు. సచివాలయం కూల్చివేతపై సంబంధిత శాఖ అధికారులు కోర్టుకు నివేదిక రుపొందిస్తున్నారని, త్వరలోనే పరిష్కారం అవుతుందని చెప్పారు. ఇంకా దేశ వ్యాప్తంగా ఆర్థిక మాంద్యం నెలకొందని దాన్ని అధిగమించేందుకు ముఖ్యమంత్రి కెసిఆర్‌ కేబినెట్‌ సబ్‌ కమిటీ ఏర్పాటు చేశారన్నారు.

తాజా ఎపీ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/