బాలకృష్ణ కు సిగ్గు లేదంటూ కొడాలి నాని ఘాటు వ్యాఖ్యలు

వైస్సార్సీపీ మాజీ మంత్రి , గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని మరోసారి చంద్రబాబు ఫై నిప్పులు చెరిగారు. మహానటుడు ఎన్టీఆర్ మరణించి 25 ఏళ్లు గడిచినా.. ఇప్పటికీ చంద్రబాబు షోల పేరుతో ఆయనపై అసత్య ప్రచారాలు చేస్తూ క్షోభ పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేసారు. బాలకృష్ణ కు తండ్రి చావుకు కారణమైన చంద్రబాబు ఫ్యామిలీతో షోలు చేయడానికి సిగ్గు ఉండాలన్నారు. అంతే కాదు పవన్ కళ్యాణ్ రాజకీయ అజ్ఞాని.. చిల్లర కోసం ఆశపడి చంద్రబాబు చెప్పినట్లు ఆడుతున్నారని ఘాటు వ్యాఖ్యలు చేశారు.
2019 ఎన్నికల్లో గాజువాక ప్రజలు పవన్‌ను ఓడించి ఉమ్మేసినా సిగ్గు లేదని ధ్వజమెత్తారు. అమరావతిలో టీడీపీ వాళ్ళు చేసిన రియల్ ఎస్టేట్ మాఫియా, విశాఖలో కూడా జరుగుతునట్లు ప్రచారం చేస్తున్నారని అన్నారు. 29 గ్రామాల అమరావతి ఎక్కడ, 25 లక్షల జనాభా గల విశాఖ ఎక్కడ అని అన్నారు. విశాఖ నగరంపై టీడీపీ రియల్ ఎస్టేట్ బ్రోకర్లు విషం కక్కుతున్నారని ఆయన దుయ్యబట్టారు. నారా లోకేష్‌కు పార్టీని పూర్తిగా అప్పచెప్పాలన్నదే చంద్రబాబు నాయుడు లక్ష్యం అన్నారు.
కానీ ఆ పార్టీ అభిమానులు.. చాలామంది నేతలు మాత్రం.. అందుకు సిద్ధంగా లేరని.. వారంతా జూనియర్ ఎన్టీఆర్ పగ్గాలు చేపట్టాలని కోరుకుంటున్నారని.. అందుకే ఆ కోపంతోనే చంద్రబాబు నాయుడే.. అమరావతి రైతుల పాదయాత్రలో జూనియర్ ఎన్టీఆర్‌ను తిట్టిస్తున్నారన్నారని ఆరోపించారు.