మంగళగిరిలో ఓటేసిన పవన్ కళ్యాణ్

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మంగళగిరిలో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. పోలింగ్ ప్రారంభమైన కాసేపటికే పవన్ కళ్యాణ్ దంపతులు లక్ష్మీనరసింహస్వామి కాలనీలోని గిరిజన కోపరేటివ్ సంస్థ వద్ద ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రానికి వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.

పవన్ కళ్యాణ్ రాకతో పోలింగ్ బూత్ వద్ద కాస్త తోపులాట చోటుచేసుకుంది. పవన్ ను చూసేందుకు అభిమానులు ఎగబడ్డారు. దీంతో పోలింగ్ కేంద్రం వద్ద పరిస్థితి కంట్రోల్ చేయడానికి, జనాలను అదుపు చేయడానికి సిబ్బంది తీవ్ర ఇబ్బందులు పడ్డారు.