చిరుతో మరోసారి ‘లెట్స్‌ డూ కుమ్ముడు’ అనిపించబోతున్న శేఖర్ మాస్టర్

మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం వరుస సినిమాలతో యంగ్ హీరోలకు పోటీ ఇస్తున్నాడు. ఓ సినిమా సెట్స్ ఫై ఉండగానే మరో సినిమాను సెట్స్ పైకి తీసుకొస్తున్నాడు. రీసెంట్ గా ఆచార్య మూవీ పూర్తి చేసిన ఈయన..ప్రస్తుతం మోహన్ రాజా డైరెక్షన్లో గాడ్ ఫాదర్ మూవీ చేస్తున్నాడు. దీంతో పాటు మెహర్‌ రమేష్‌ దర్శకత్వంలో భోళా శంకర్ మూవీ చేస్తున్నాడు. అయితే ఈ మూవీ లో చిరంజీవి తో ‘లెట్స్‌ డూ కుమ్ముడు’ అనిపించబోతున్నాడట డాన్స్ మాస్టర్ శేఖర్.

చిరు 150 మూవీ ‘ఖైదీ నం.150’లో ‘ అమ్మడు లెట్స్‌ డూ కుమ్ముడు’ అంటూ చిరంజీవి తో అదిరిపోయే స్టెప్స్ వేయించిన శేఖర్ మాస్టర్..తాజాగా ‘ఆచార్య’లోనూ ఓ మాస్‌ పాటకు కొరియోగ్రఫీ అందించారు. ఇక ఇప్పుడు ‘బోళా శంకర్‌’ చిత్రంలోను ఓ సాంగ్ కు కోరియోగ్రఫీ అందించే ఛాన్స్ అందుకున్నాడు. దీనికి సంబంధించిన ఫొటోను ఆయన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేశారు. ప్రస్తుతం సోషల్‌ మీడియాలో ఈ ఫొటో వైరల్‌ అవుతోంది. ఇక ఆచార్య విషయానికి వస్తే ఫిబ్రవరి 04 న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. కొరటాల శివ డైరెక్ట్ చేయగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఈ మూవీ లో కీలక పాత్ర పోషించాడు. ఆయనకు జోడిగా పూజా హగ్దే నటించింది.