మనసు మూగవోయింది : లతా మంగేష్కర్

బాలు మృతికి సంతాపం

SP Balasubramaniam-Lata Mangeshkar
SP Balasubramaniam-Lata Mangeshkar

Mumbai: : గాన గంధర్వుడు ఎస్‌.పి.బాలసుబ్రహ్మణ్యం (74) తిరిగి రాని లోకాలకు తరలివెళ్లారని తెలియగానే బాలీవుడ్‌ దుఃఖ సాగరంలో మునిగిపోయింది.

‘హమ్‌ బనే తుమ్‌ బనే’, ‘పెహ్లా పెహ్లా ప్యార్‌’, ‘దిల్‌ దీవానా’ వంటి పలు హిందీ హిట్‌ సాంగ్స్‌ పాడిన బాలుతో తమకు ఉన్న సాన్నిహిత్యాన్ని తలుచుకుని పలువురు ప్రముఖులు కన్నీటి పర్యంతమయ్యారు. సంతాప సందేశాలు వెల్లువెత్తాయి.

బాలుతో తనకున్న సాన్నిహిత్యాన్ని లతా మంగేష్కర్‌ ఓ ట్వీట్‌లో గుర్తు చేసుకున్నారు. ‘బాలు ప్రతిభావంతులైన గాయకుడు. ఆయన స్వర్గస్థులయ్యారని తెలిసి మనసు మూగబోయింది. ఇద్దరం కలిసి పాడాం, ఎన్నో షోలు ఇచ్చాం.

అవన్నీ నా కళ్ల ముందు మెదులుతున్నాయి. ఈశ్వరుడు ఆయన ఆత్మకు శాంతి కలిగించాలని ప్రార్థిస్తున్నాను.

వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను’ అని లతా మంగేష్కర్‌ అన్నారు.

తాజా క్రీడా వార్తల కోసం: https://www.vaartha.com/news/sports/