తెలంగాణ బిజెపి అధ్యక్షుడిగా బండి సంజయ్

Bandi Sanjay Kumar
Bandi Sanjay Kumar

హైదరాబాద్‌: తెలంగాణ బిజెపి అధ్యక్షుడిగా కరీంనగర్‌ ఎంపి బండి సంజయ్ ను అధిష్ఠానం నియమించింది. ఈ మేరకు పార్టీ జాతీయ అధ్యక్షుడు జెపి నడ్డా నిర్ణయం తీసుకున్నారు. నడ్డా ఆదేశాలతో బండి సంజయ్ నియామకంపై బిజెపి జాతీయ కార్యదర్శి అరుణ్‌సింగ్‌ ఓ ప్రకటన విడుదల చేశారు. కాగా మొదటి నుంచి బిజెపి అధ్యక్ష రేసులో చాలా మంది పోటీ పడగా చివరికి అది బండి సంజయ్ ను వరించింది.

తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/business/