3,428 డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు పరిశీలించాం

మొత్తం ఇళ్లు చూశాక నా నిర్ణయం ప్రకటిస్తా..భట్టి

Minister Talasani Srinivas Yadav, CLP Leader Bhatti Vikramarka Inspects Double Bedroom Houses in Hyd

హైదరాబాద్‌: టిఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ నేతల మధ్య డబుల్‌ బెడ్‌ రూం ఇళ్ల విషయంలో శాసనసభలో నిన్న వాడీవేడీ చర్చ నడిచిన విషయం తెలిసిందే. ఈక్రమంలోనే అధికారులతో కలిసి తలసాని ఈ రోజు ఉదయం భట్టి విక్రమార్క ఇంటికి వెళ్లి ఆయనతో గ్రేటర్‌ పరిధిలో డబుల్ బెడ్‌రూమ్‌ ఇళ్లను పరిశీలించారు. జియాగూడ, గోడే ఖబర్‌, అంబేడ్కర్‌ నగర్‌లో ఇళ్లను పరిశీలించిన వారిద్దరూ… కట్టెలమండి, సీసీనగర్‌, కొల్లూరులోని డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్ల పరిశీలనకు వెళ్లారు. ఈ సందర్భంగా భట్టి మాట్లాడుతూ.. ఇప్పటి వరకు 3,428 డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు పరిశీలించాం. ఉదయం నుంచి ఇళ్లను పరిశీలిస్తున్నాం. 2 లక్షల ఇళ్లలో లక్ష ఇళ్లు పూర్తయ్యాయని మంత్రి చెప్పారు. ఇవాళ నాలుగు చోట్ల తిరిగాం. రేపు ఎల్లుండి ఇళ్లను పరిశీలిస్తాం. మంత్రి తలసాని, మేయర్‌తో కలిసి ఇళ్లను పరిశీలించాం. డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్ల క్వాలిటీపై ఇంజినీరింగ్‌ బృందం పరిశీలిస్తోంది. మొత్తం ఇళ్లు చూశాక నా నిర్ణయం ప్రకటిస్తా. అని విక్రమార్క అన్నారు.


తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/international-news/