మద్యం అమ్మకాల్లో తెలంగాణ టాప్..

మద్యం అమ్మకాల్లో తెలంగాణ టాప్ స్థానంలో నిలిచింది. తెలంగాణ రాష్ట్రంలో మద్యం అమ్మకాలు ఏ రేంజ్ ఉంటాయో చెప్పాల్సిన పనిలేదు. తాజాగా ఎక్సెజ్ అధికారులు సీఎం రేవంత్ కు మద్యం లెక్కలు తెలిపారు. దక్షిణాదిలోని ఇతర రాష్ట్రాలైన ఏపీ, తమిళనాడు, కేరళకు మించి ఇక్కడ మద్యం వినియోగిస్తున్నట్టు పేర్కొన్నారు. అంటే దక్షిణాదిలో లిక్కర్ వినియోగంలో తెలంగాణది టాప్ ప్లేస్. దీనివల్ల ప్రభుత్వానికి ఆదాయం కూడా భారీగానే సమకూరుతోందని లెక్కలతో సీఎం ముందు ఉంచారు.

ఎక్సైజ్ అధికారుల నివేదిక ప్రకారం.. ఆంధ్రప్రదేశ్ జనాభా 4.93 కోట్లు. 2022-23లో అక్కడ 3.35 కోట్ల లిక్కర్ (ఐఎంఎల్) కేసులు అమ్ముడుపోయాయి. దీనినిబట్టి అక్కడ తలసరి మద్యం వినియోగం 6.04 లీటర్లు. 1.16 కోట్ల కేస్‌ల బీర్లు అమ్ముడయ్యాయి. అంటే తలసరి బీర్ల వినియోగం 1.86 లీటర్లు. తమిళనాడులో తలసరి మద్యం వినియోగం 7.66 లీటర్లు కాగా, బీర్ల వినియోగం 3.75 లీటర్లు. ఇక, తెలంగాణతో దాదాపు సమాన జనాభా కలిగిన కేరళలో తలసరి లిక్కర్ వినియోగం 5.93 లీటర్లు కాగా, బీర్ల వినియోగం 2.63 లీటర్లు.

ఇదిలా ఉంటె తెలంగాణ లో కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం మద్యం విషయంలో పలు కీలక నిర్ణయాలు తీసుకోబోతుంది. ముఖ్యంగా రాష్ట్రంలో బెల్టు షాపులను తీసివేయాలని , వైన్ , బార్ షాప్స్ కు కూడా పలు నిబంధనలు విధించే ఆలోచన చేస్తున్నారు.