సినిమాను విమర్శించే వారిపై నాగబాబు ఆగ్రహం

సినిమాల్లో వ‌యొలెన్స్‌ను ఎక్కువ‌గా చిత్రీక‌రిస్తున్నార‌ని అది స‌మాజంపై ప్ర‌భావం చూపుతుందని, సినిమాల వ‌ల్లే స‌మాజంలో చెడు పెరిగిపోతుంద‌ని కొంతమంది వాదనలు చేయడం పట్ల మెగా బ్రదర్ , జనసేన నేత నాగబాబు ఆగ్రహం వ్యక్తం చేసారు. ఈ మేరకు సోషల్ మీడియా లో దీనిపై స్పందించారు.

‘‘సినిమాల వల్ల జనాలు చెడిపోతున్నారు అని ఏడ్చే కుహనా మేధావులకు ఇది సమాధానం. సినిమాల్లో ఏదన్నా ఓవర్‌గా ఉంటే సెన్సార్ ఉంది.కుహనా మేధావులు ఏడవకండి. సినిమాల్లో చూపించే వ‌యొలెన్స్ వల్ల జనాలు చెడిపోతారు అనుకుంటే ,మరి సినిమాల్లో చూపించే మంచి వల్ల జనాలు బాగుపడాలి కదా. మూవీ మేక‌ర్‌గా ఒకటి నిజం ,సినిమాలు ఎంట‌ర్‌టైన్‌మెంట్ కోస‌మే ,జనాన్ని బాగు చెయ్యటం కోసమో చెడగొట్టాడని కోసమో తేసేంత గొప్పవాళ్ళు లేరిక్కడ . ఇదొక వ్యాపారం మాత్ర‌మే’’ అని స్పష్టం చేసారు.

నాగబాబు చేసిన ట్వీట్ కు చాలామంది మద్దతు పలుకుతూ కామెంట్స్ పెడుతున్నారు. సినిమాను..సినిమాలాగేనే చూడాలని చెపుతున్నారు. ఇక ప్రస్తుతం నాగబాబు.. పవన్ కళ్యాణ్ స్థాపించిన జనసేన పార్టీలో కీలక భూమికను పోషిస్తున్నారు.