రేపు విచారణకు అందుబాటులో ఉంటానన్న టిఆర్ఎస్ ఎమ్మెల్సీ

తొలుత ఆమెను ఒక సాక్షిగా విచారించనున్న సీబీఐ

kavitha

హైదరాబాద్‌ః ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు సీబీఐ నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ నెల 6వ తేదీనే ఆమెను సీబీఐ అధికారులు విచారించాల్సి ఉంది. అయితే 6వ తేదీన తనకు ఇతర కార్యక్రమాలు ఉన్నాయని… ఈ నెల 11, 12, 14, 15 తేదీల్లో తాను అందుబాటులో ఉంటానని సీబీఐకి కవిత లేఖ రాశారు. దీనిపై సీబీఐ డీఐజీ మంగళవారం కవితకు మెయిల్ పంపించారు. మీరు పేర్కొన్న తేదీలను పరిగణనలోకి తీసుకున్నామని… ఈ నెల 11న ఉదయం 11 గంటలకు హైదరాబాద్ లోని మీ నివాసానికి సీబీఐ బృందం వస్తుందని… ఆ సమయంలో విచారణకు అందుబాటులో ఉండాలని పేర్కొన్నారు. దీనికి సమాధానంగా కవిత మెయిల్ ద్వారా స్పందించారు. 11వ తేదీ ఉదయం తన నివాసంలో తాను అందుబాటులో ఉంటానని చెప్పారు. ఈ నేపథ్యంలో, కవితను రేపు సీబీఐ విచారించనుంది.

సీబీఐ కవితకు సీఆర్పీసీ సెక్షన్ 160 కింద నోటీసులు పంపింది. అంటే ఈ స్కామ్ కు సంబంధించి ఆమెను తొలుత ఒక సాక్షిగా విచారిస్తారు. ఆ తర్వాత విచారణలో తేలే విషయాలను బట్టి ఆమెను కేసులో ముద్దాయిగా చేర్చవచ్చు. అదే జరిగితే ఆమెపై కేసు నమోదు చేసి, రిమాండ్ కు తరలించే అవకాశం కూడా ఉంటుంది.

తాజా సినిమా వార్తల కోసం క్లిక్‌ చేయండిః https://www.vaartha.com/news/movies/