ఆర్బీఐ నుంచి రూ. 4 వేల కోట్ల అప్పు

లాక్ డౌన్ వేళ ప్రభుత్వానికి తగ్గిన ఆదాయం.. ఆర్బీఐ నుంచి రూ. 4వేల కోట్ల రుణం తీసుకున్న తెలంగాణ ప్రభుత్వం

TS CM KCR
TS CM KCR

హైదరాబాద్‌: తెలంగాణలో కరోనా నియంత్రణ చర్యలో భాగంగా లాక్‌ డౌన్‌ అమలు చేసిన విషయం తెలిసిందే. దీంతో ప్రభుత్వానికి ఆదాయం తగ్గిపోగా, నిధుల కోసం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి తెలంగాణ ప్రభుత్వం రూ. 2 వేల కోట్ల రుణాన్ని తీసుకుంది. ఎస్డీఎల్ (స్టేట్ డెవలప్ మెంట్ లోన్) కింద బాండ్ల విక్రయం, సెక్యూరిటీల ద్వారా ఈ రుణాన్ని రాష్ట్ర ప్రభుత్వం పొందింది. ఈ రుణంలో రూ. 1000 కోట్లను 2026 నాటికి, మిగతా మొత్తాన్ని 2028 నాటికి తిరిగి చెల్లించాల్సి వుంటుంది. కాగా, ఈ నెల 13న కూడా ప్రభుత్వం రూ. 2 వేల కోట్లను రుణంగా తీసుకున్న సంగతి తెలిసిందే. దీంతో 10 రోజుల వ్యవధిలోనే ప్రభుత్వం రూ. 4 వేల కోట్ల రుణాన్ని తీసుకున్నట్లయింది.

తాజా ఎన్నారై వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/nri/