రాజకీయలపై స్పందించిన బండ్లగణేష్‌

ఏపిలో ప్రతి నెల ఎన్నికలు వస్తాయేమో అనే భయంలో ఏపి నాయకులు ఉన్నట్లున్నారు

bandla ganesh
bandla ganesh

హైదరాబాద్‌: తెలుగు రాష్ట్రాల రాజకీయ నాయకులపై సిని నిర్మాత బండ్లగణేష్‌ స్పందించారు. తెలంగాణ రాష్ట్రంలో సిఎం కెసిఆర్‌ పై ప్రశంశలు కురిపించాడు. గతంలో కెసిఆర్‌ ప్రజలను ఉద్దేశించి మనమెవ్వరము వెయ్యేళ్లు బతకాడానికి ఇక్కడికి రాలేదు. ఉన్నన్ని రోజులు గొప్పగా బతికి అందరికి ఆదర్శంగా ఉంటే చాలు అదే ముఖ్యం అని చేసిన వాఖ్యలను గుర్తు చేస్తు.. నిజాయితి మీ యశస్సు, నీతి మీ ఆయుష్సు … జై కెసిఆర్‌ అంటూ ఓ ట్వీట్‌ చేశారు. ఇదే తరుణంలో ఏపి రాజకీయాలను ప్రస్తావిస్తు విమర్శలు చేశారు. టీవీలు చూస్తుంటే ఏపి రాజకీయ నాయుకులు ప్రతినెల ఎలక్షన్‌ వస్తాయేమో అనేభయంతో డిబేట్లో పాల్గోన్నట్లు అనిపిస్తుంది అని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో ఎన్నికలు ఐదేళ్ల కు ఒకసారి వస్తాయని ఈ విషయాన్ని రాజకీయ నాయకు లు గమనించాలని సూచించారు.

తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/international-news/