ఘోర రోడ్డు ప్రమాదం.. ఏడుగురి మృతి

కృష్ణా జిల్లాలో వేదాద్రి వద్ద ట్రాక్టర్, లారీ ఢీ

road-accident-in-krishna-distric

జగ్గయ్యపేట: కృష్ణా జిల్లాలో ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. జగ్గయ్యపేట మండలం వేదాద్రి వద్ద ట్రాక్టర్, లారీ ఢీకొని ఏడుగురు మృతి చెందారు. 24 మందికి తీవ్రగాయాలు కాగా, వారిని ఆసుపత్రికి తరలించారు. మృతులంతా ఖమ్మం జిల్లా మధిర వాసులని గుర్తించారు. కాగా ప్రమాద సమయంలో ట్రాక్టర్ లో 30 మందికి పైగా ఉన్నట్టు తెలుస్తోంది. ఘటన జరిగిన వెంటనే పోలీసులు, ఇతర అధికారులు అక్కడికి చేరుకుని సహాయచర్యలకు ఉపక్రమించారు.


తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/