డీకే శివ కూమార్‌తో మల్లారెడ్డి భేటీ

కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ (DK Shivakumar) తో బిఆర్ఎస్ మాజీ మంత్రి, ఎమ్మెల్యే మల్లారెడ్డి (MLA MallaReddy) భేటీ కావడం తో ఇప్పుడు రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. గత కొద్దీ రోజులుగా మల్లారెడ్డి కాంగ్రెస్ లో చేరేందుకు సిద్దమయ్యాడనే వార్తలు ప్రచారం అవుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో డీకే శివకుమార్‌ను బెంగళూరులోని ఓ హోటల్లో మల్లారెడ్డి తో పాటు ఆయన తనయుడు భద్రారెడ్డి, మల్కాజ్ గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి వీరంతా కలిసి డీకే తో మంతనాలు జరిపారు. కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు మల్లారెడ్డి రంగం సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తోంది. రేపు ప్రియాంక గాంధీ అపాయింట్‌మెంట్‌ను మల్లారెడ్డి కుటుంబ సభ్యులు కోరినట్లు తెలిసింది. ఇవన్నీ చూస్తే అతి త్వరలోనే కేసీఆర్ కు మల్లారెడ్డి షాక్ ఇవ్వనున్నారని అర్ధం అవుతుంది.

బిఆర్ఎస్ ప్రభుత్వంలో మల్లారెడ్డి ఏ రేంజ్ లో సీఎం రేవంత్ ఫై కామెంట్స్ , సవాళ్లు , విమర్శలు చేసారో తెలియంది కాదు..బస్తేనే సవాల్ అటు తొడలు కొట్టిన రోజులుకూడా ఉన్నాయి. వీటిన్నింటికి రేవంత్ లెక్క ఒప్పజెపుతున్నాడు. గత కొద్దీ రోజులుగా మల్లారెడ్డి కి కాంగ్రెస్ ప్రభుత్వం వరుస షాకులు ఇస్తు వస్తుంది. ముఖ్యంగా మల్లారెడ్డి ఫై పెద్ద ఎత్తున భూకబ్జా ఆరోపణలు ఉండడం తో వాటిని బయటకు తీసే పనిలో పడింది కాంగ్రెస్ సర్కార్. మొన్నటికి మొన్న చిన్నదామర చెరువులో ఎరోనాటికల్, MLRIT కళాశాలని గదులను కూల్చివేశారు.

గతంలో చిన్నదామర చెరువులో ఎరోనాటికల్, MLRIT కళాశాలలో స్థలాలు ఆక్రమించినట్లుగా ఫిర్యాదులు రావడంతో మేడ్చల్ జిల్లా కలెక్టర్ గౌతం అధికారులతో కలిసి స్థలాలను పరిశీలించారు. ఆక్రమణలు ఉన్నట్లు నిర్ధారించిన కలెక్టర్ అధికారులకు కూల్చివేతలు చేపట్టాలని ఆదేశించారు. కలెక్టర్ గౌతం ఆదేశాలతో గండిమైసమ్మ మండల రెవెన్యూ, ఇరిగేషన్, మున్సిపల్ శాఖ అధికారులు కూల్చివేతలు చేసారు. ఇలా వరుసపెట్టి కాంగ్రెస్ ప్రభుత్వం నుండి ఇబ్బందులు వస్తుండడంతో కాంగ్రెస్ లో చేరితేనే బెటర్ అని మల్లారెడ్డి భావించి..ఆ పార్టీ లోకి చేరేందుకు సిద్ధం అయ్యారని తెలుస్తుంది.