తెలంగాణ‌లో ప‌ది ప‌రీక్ష‌ల షెడ్యూల్ మార్పు

మే 23 నుంచి జూన్ 1 వరకు ఎగ్జామ్స్

tenth-class-exams


హైదరాబాద్: తెలంగాణ ప‌దో త‌ర‌గ‌తి ప‌రీక్ష‌లకు సంబంధించి స‌వ‌రించిన‌ షెడ్యూల్ కూడా విడుద‌లైంది. రాష్ట్ర వ్యాప్తంగా మే 23వ తేదీ నుంచి టెన్త్ ఎగ్జామ్స్ ప్రారంభం కానున్నాయి. ఈ మేర‌కు బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేష‌న్ షెడ్యూల్‌ను బుధ‌వారం విడుద‌ల చేసింది. ఉద‌యం 9:30 గంట‌ల నుంచి మ‌ధ్యాహ్నం 12:45 గంట‌ల వ‌ర‌కు ప‌రీక్ష‌ల‌ను నిర్వ‌హించ‌నున్నారు.

ప‌రీక్ష‌ల టైం టేబుల్..


మే 23(సోమ‌వారం) – ఫ‌స్ట్ లాంగ్వేజ్
మే 24(మంగ‌ళ‌వారం) – సెకండ్ లాంగ్వేజ్
మే 25(బుధ‌వారం) – థ‌ర్డ్ లాంగ్వేజ్(ఇంగ్లీష్‌)
మే 26(గురువారం) – గ‌ణితం
మే 27(శుక్ర‌వారం) – భౌతిక శాస్త్రం, జీవ శాస్త్రం
మే 28(శ‌నివారం) – సాంఘిక శాస్త్రం
మే 30(సోమ‌వారం) – ఓఎస్ఎస్సీ మెయిన్ లాంగ్వేజ్ పేప‌ర్-1
మే 31(మంగ‌ళ‌వారం) – ఓఎస్ఎస్సీ మెయిన్ లాంగ్వేజ్ పేప‌ర్-2
జూన్ 1(బుధ‌వారం) – ఎస్ఎస్సెసీ ఒకేష‌నల్ కోర్సు(థియ‌రీ). ఉద‌యం 9:30 నుంచి 11:30 వ‌ర‌కు

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి : https://www.vaartha.com/news/national/