ఏడాదిగా సొంత కూతురుపైనే అత్యాచారం..ఈ నీచుడ్ని ఏంచేయాలి ..?

another-rape-incident-in-hyderbad-mangalhat-area

సమాజం ఏమైపోతుందో అర్ధం కావడం లేదు. తమ కామ కోరిక తీర్చుకోవడం కోసం కన్న బిడ్డలను సైతం వదలం లేదు కామపిశాచులు. ఇప్పటికే ఇలాంటి ఎన్నో ఘటనలు వెలుగులోకి వచ్చి సభ్య సమాజం తలదించుకునేలా చేయగా..తాజాగా వికారాబాద్ జిల్లాలో ఇదే తరహా సంఘటన చోటుచేసుకుంది. ఏడాది గా కన్న బిడ్డపై అత్యాచారం చేస్తూ..ఆమెను గర్భవతిని చేసిన నీచ తండ్రి.

వివరాల్లోకి వెళ్తే ..

జిల్లాలోని ఓ గ్రామంలో నివసిస్తున్న దంపతుకు ఇద్దరు కూతుళ్లు, ఓ కుమారుడు ఉన్నారు. నాలుగేళ్ల క్రితం
వీరంతా పటాన్ చెరుకు వలస వెళ్లారు. భార్య వెంచర్ లో పని చేస్తుండగా.. భర్త ఆటోనడుపుతూ జీవనం కొనసాగిస్తున్నాడు. 15 ఏళ్ల వయసున్న పెద్ద కూతురు ఇంటి వద్దే ఉంటుంది. అయితే ఎవరూ లేని సమయంలో మధ్యహ్నం పూట ఇంటికి వచ్చే తండ్రి.. పెద్ద కూతురును బెదిరిస్తూ ఏడాదిగా అత్యాచారానికి పాల్పడుతున్నాడు. ఇటీవల తల్లి.. ముగ్గురు పిల్లలతో కలిసి సొంతూరుకు వచ్చింది.

పెద్ద కూతురు అస్వస్థతకు గురి కావడంతో ఆస్పత్రికి తీసుకెళ్లగా..డాక్టర్స్ ఆమె మూడో నెల గర్భవతి అని చెప్పడంతో తల్లి షాక్ కు గురైంది. తల్లి.. కూతురుని నిలదీయగా.. జరిగిన విషయం చెప్పింది. అనంతరం భర్తను నిలదీసింది. అతడు అందర్నీ చంపేస్తానని బెదిరించి ఓ ప్రైవేటు ఆస్పత్రిలో బాలికకు ఆబార్షన్‌ చేయించాడు. ఈ విషయం బయటకు రావడం తో స్థానికులంతా ఆ నీచుడ్ని పోలీసులకు అప్పగించారు.