సీఎం జగన్ పై బుద్ధా వెంకన్న విమర్శలు

అసెంబ్లీ లో నాటుసారాపై అబద్ధమాడినా సీఎం జగన్ : బుద్ధా వెంకన్న

buddha venkanna
buddha venkanna

అమరావతి: జంగారెడ్డిగూడెంలో నాటుసారా తయారు కావడం లేదని 5 కోట్ల ఆంధ్రుల సాక్షిగా అసెంబ్లీలో సీఎం జగన్ అబద్ధమాడరని టీడీపీ నేత బుద్ధావెంకన్న ఆరోపించారు. జంగారెడ్డిగూడెంలో నాటుసారా తాగి చనిపోయిన వారి వివరాలను ఆయన వెల్లడించారు. టీడీపీ చేసినా పోరాటం తర్వత ౩౩ కేసులు పెట్టి, 22 మందిని అరెస్ట్ చేసారని అన్నారు. కల్తీసారా తాగి మృతిచెందిన వారి ఫోన్ నంబర్లతో సహా మీకు పూర్తిగా ఆధారాలతో అందిస్తాము. అంతేగాకుండా వరదరాజులు అనే మృతుడి భర్య మీకు రాసిన లేఖను అందిస్తూన్నాం. మీకు ఈ విషయంలో ఏమాత్రం చిత్తశుధ్ధి ఉన్నా ఈ సంఘటనపై విచారణ చేయించి బాధ్యులను అరెస్ట్ చేసి, హృదయవిదారకంగా మారిన బాధితులను న్యాయం చేయాలనీ బుద్ధావెంకన్న సీఎం జగన్ ను డీమాండ్ చేశారు.

తాజా ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి :https://www.vaartha.com/news/national/