రాష్ట్ర నూతన సచివాలయం ప్రారంభోత్సవం వాయిదా

తెలంగాణ రాష్ట్ర నూతన సచివాలయం ప్రారంభోత్సవం వాయిదా పడింది. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ కారణంగా ప్రభుత్వం సచివాలయం ప్రారంబోత్సవాన్ని వాయిదా వేసింది. తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ఈ సచివాలయంను ముందుగా సీఎం కేసీఆర్ పుట్టిన రోజైనా ఫిబ్రవరి 17న ప్రారంభించాలని నిర్ణయించారు. ఈ ప్రారంభోత్సవానికి పలు రాష్ట్రాల సీఎంలు, నాయకులనూ ఆహ్వానించారు. ఇంతలో తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. దీంతో ఎలక్షన్ కోడ్ అమలులో ఉండడంతో సచివాలయం ప్రారంభోత్సవాన్ని వాయిదా వేసినట్లు ప్రభుత్వం చెప్పింది. త్వరలోనే కొత్త సచివాలయం ప్రారంభోత్సవానికి సంబంధించిన తేదీని ప్రకటించనున్నారు.

తెలంగాణ రాష్ట్రంలో ఒక టీచర్, ఒక స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలు జరగాల్సి ఉంది. ఎన్నికలకు సంబంధించిన షెడ్యూల్ ఫిబ్రవరి 9వ తేదీన విడుదలైంది. ఫిబ్రవరి 16వ తేదీన నోటిఫికేషన్ జారీ చేసి, ఫిబ్రవరి 23 వరకు నామినేషన్లను స్వీకరించనున్నారు. ఆపై ఫిబ్రవరి 27వ తేదీన నామినేషన్ ల ఉపసంహరణ ఉంటుంది. ఇక పాత సచివాలయం పనికిరాదని దానిని కూల్చి దాదాపు 617 కోట్ల రూపాయలతో కనివిని ఎరుగని రీతిలో అద్భుతంగా సచివాలయ నిర్మాణాన్ని చేపట్టారు. అత్యంత ఖరీదైన ఫర్నిచర్, అత్యాధునిక వసతులతో, ఎంతో విలాసవంతంగా నిర్మించారు.