మహబూబూబాద్ జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలో క్షుద్రపూజల కలకలం

గతంలో క్షుద్రపూజలు ఎక్కువగా ఊరు బయట..చెరువు గట్ల ఫై , నాలుగు రోడ్లు కలిసే చోట చేసేవారు. కానీ ఈ మధ్య పిల్లలు చదువుకునే పాఠశాలలో చేస్తున్నారు. ఇప్పటికే ఇలాంటి ఘటనలు వెలుగులోకి రాగా..తాజాగా మహబూబూబాద్ జిల్లాలోని కురవి మండలం సూదనపల్లి గ్రామ ప్రభుత్వ పాఠశాల ఆవరణలో క్షుద్రపూజలు జరగడం గ్రామస్థులను , పిల్లలను భయబ్రాంతులకు గురి చేసింది.

వివరాల్లోకి వెళ్తే..జిల్లాలోని కురవి మండలం సూదనపల్లి గ్రామ ప్రభుత్వ పాఠశాలలోని తరగతి గది లోపల పసుపు, కుంకుమ, నిమ్మకాయలు, బొమ్మతో క్షుద్రపూజలు జరిపిన ఆనవాళ్లు కనిపించాయి. దీంతో అంత భయపడిపోయారు. పిల్లలను స్కూల్ కు పంపేందుకు తల్లిదండ్రులు ఖంగారు పడుతున్నారు. ఇక ఈ విషయంలో ఉపాధ్యాయులు మాట్లాడుతూ.. పాఠశాలకు గేట్లు లేకపోవడం వల్ల అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారుతుందని ఆరోపిస్తున్నారు. ఇక ఈ ఘటన కారణంగా విద్యార్థులతో పాటు, వారి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు కూడా తీవ్ర భయాందోళనుకు లోనయ్యారు. ఇదే కాదు నిన్న(ఫిబ్రవరి 10) కూడా హనుమకొండ భీమదేవర పల్లిలో క్షుద్ర పూజలు కలకలం రేపాయి. శుక్రవారం ఉదయం బీసీ కాలనీలోని కుదురుపాక రాజయ్య తెల్లవారుజామున లేచి చూడగా ఇంటి ముందు పూల చెట్టుకు తాయత్తు కట్టి కోడి తల, నల్ల బట్ట, జిల్లేడు ఆకులు , పసుపు కుంకుమ, మంత్రించిన నిమ్మకాయలు, దారాలు, కొబ్బరి కాయలు అన్ని కలిపి ఒక కసంచిలో పెట్టి క్షుద్ర పూజలు నిర్వహించారు.