జనసేన లోకి ఆమంచి శ్రీనివాసరావు..?

ఏపీలో రాజకీయాలు రోజు రోజుకు వేడి పెంచుస్తున్నాయి. ఎన్నికల సమయానికి ఏ నేతలు ఏ పార్టీ లో చేరతారా అనేది అర్ధం కావడం లేదు. ముఖ్యంగా అధికార పార్టీ వైస్సార్సీపీ లో అసమ్మతి సెగ ఎక్కువై పోతుండడంతో ఆ పార్టీ నేతలు ఎక్కువ సంఖ్యలో బయటకు వస్తారనే వార్తలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో ఆమంచి కృష్ణమోహన్‌ సోదరుడు ఆమంచి శ్రీనివాసరావు జనసేన పార్టీ లో చేరబోతారనే వార్త ఇప్పుడు ప్రకాశం జిల్లా చీరాల నియోజకవర్గంలో హాట్ టాపిక్ అవుతుంది.

బాపట్ల జిల్లా వేటపాలెం మండలం పందిళ్లపల్లిలో జనసేన పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని నిర్వహించింది. దీన్ని విజయవంతం చేయాలని కోరుతూ జనసేన శ్రేణులు ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. ఈ ఫ్లెక్సీలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఫొటోతోపాటు ఆమంచి కృష్ణమోహన్ సోదరుడు ఆమంచి శ్రీనివాసరావు ఫొటో ఉండడం ఆసక్తికరంగా మారింది. మాజీ ఎమ్మెల్యే సోదరుడు జనసేనకు దగ్గరవుతున్నారనే చర్చ ప్రారంభమైంది. దీనిపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. మరి నిజంగా శ్రీనివాసరావు జనసేన పార్టీ లో చేరుతున్నారా..? లేదా అనేది అధికారికంగా తెలియాల్సి ఉంది.