తీన్మార్ మల్లన్న అరెస్ట్..

teenmar mallanna

క్యూ న్యూస్ అధినేత తీన్మార్ మల్లన్న ను పోలీసులు అరెస్ట్ చేసారు. వరంగల్ లో రైతులకు మద్దతుగా వెళ్తున్న మల్లన్న ను వరంగల్ పోలీసులు అరెస్ట్ చేశారు. వరంగల్లోని లింగాల గణపురం పోలీస్ స్టేషన్ కు ఆయన్ను తరలించారు. వరంగల్ లో లాండ్ పూలింగ్ రియల్ మాఫియా జరుగుతున్న నేపథ్యంలో అక్కడికి తీన్మార్ మల్లన్న వెళ్లే ప్రయత్నం చేశారు. ఈ నేపథ్యంలోనే ఆయన్ను అరెస్ట్ చేశారు.

ఇదిలా ఉంటె ..మల్లన్న రీసెంట్ గా బిజెపి పార్టీ నుండి బయటకు వస్తున్నట్లు ప్రకటించారు. త్వరలో కొత్త పార్టీ పెట్టబోతున్నట్లు చెప్పుకొచ్చారు. రాష్ట్రాన్ని పట్టిపీడిస్తున్న దొంగల ముఠా సభ్యుల సంఖ్య 7200. తెలంగాణ ఆస్తులను కొల్లగొడుతున్న వారి సంఖ్య 7200. రాష్ట్ర ప్రజల రక్తం తాగుతున్న వారి సంఖ్య 7200. అందుకే మల్లన్న టీం-7200 పేరుతో నేను ఉద్యమం చేస్తున్నా. నేను ఏర్పాటు చేసిన ఈ టీం బీజేపీ కన్నా లక్ష రెట్లు నయం. ఇక బీజేపీ కార్యాలయంలో నేను ఎప్పటికీ అడుగుపెట్టను. నేను బీజేపీలో చేరడం అనేది ఇక ముగిసిన చరిత్ర’ అని తీన్మార్ మల్లన్న పేర్కొన్నారు.

వరంగల్ లో రైతుల కు మద్దతుగా వెళ్తున్న మల్లన్న ని ముందస్తుగా ప్రివెంటీవ్ అరెస్టు చేసిన పోలీసులు లింగాల ఘనపురం పీఎస్ కు తరలింపు ల్యాండ్ పూలింగ్ రియల్ మాఫియా కోసమే @QGroupMedia7200 pic.twitter.com/lEZb8rPZT7— Teenmar Mallanna (@TeenmarMallanna) May 10, 2022