అర్ధరాత్రి యువతీ ట్వీట్..స్పందించిన సజ్జనార్

TSRTC- MD-Sajjanar‌s-take-key-decisions-for-women

తెలంగాణ ఆర్టీసీ ఎండీ గా బాధ్యతలు స్వీకరించిన సజ్జనార్..తనదైన మార్క్ కనపరుస్తూ ఆర్టీసీ ని లాభాల్లోకి తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తున్నాడు . గతంలో ఎన్నడూ లేని విధంగా ఆర్టీసీ లో పలు ఆఫర్లు పెట్టి ప్రయాణికులను ఆకర్షిస్తున్నాడు. తాజాగా అర్ధరాత్రి ఓ యువతీ చేసిన ట్వీట్ కు స్పందించి అందరి చేత శభాష్ అనిపించుకున్నాడు.

అర్ధరాత్రి సమయాలలో ఆర్టీసీ బస్సులలో మహిళల సౌకర్యం కోసం ( వాష్ రూమ్స్ ) బస్సులను పెట్రోల్ పంప్ లలో ఆపాలనే రూల్‌ ఉంది. ఈ నేపథ్యంలోనే మంగళవారం రాత్రి హైదరాబాద్‌ కు చెందిన పాలే నిషా అనే యువతి… ఆర్టీసీ బస్సులను 10 నిమిషాలు బస్సు ఆపాలని కోరింది. దూర ప్రాంతాలకు ప్రయాణం చేసే మహిళలు ఇబ్బందులు పడుతున్నారని ట్విట్టర్‌ లో ఆర్టీసీకి ఫిర్యాదు చేసింది. దీంతో అర్ధరాత్రి చేసిన ఆ యువతి ట్వీట్ కి స్పందించారు ఎండి సజ్జనార్. ఈ విషయం పై అధికారులకు సూచించినట్లు రిప్లయ్ ఇచ్చారు సజ్జనార్. ఈ రిప్లయ్ చూసి సదరు యువతీ తో పాటు ప్రయాణికులు అంత హర్షం వ్యక్తం చేస్తున్నారు. మరోపక్క కార్మికులు, కాలనీవాసులు 30 మందికి పైగా ఒకే ప్రాంతానికి వెళ్లాల్సి ఉంటే సమాచారం అందించాలని.. వారి ఇంటి వద్దకే బస్సు పంపుతామని తాజాగా ప్రకటించి మరోమారు వార్తల్లో నిలిచారు.