కాంగ్రెస్ లో అప్పుడే టికెట్ల లొల్లి మొదలైంది

తెలంగాణ కాంగ్రెస్ నేతల మధ్య నిత్యం ఏదో ఒక లొల్లి నడుస్తూనే ఉంటుంది. ఎన్నికల్లో గెలిచి తీరాలనే కసికన్నా సొంతపార్టీల నేతల పైచేయి సాధించాలనే తపనే ఎక్కువ ఉంటుంది. గత కొద్దీ రోజులుగా నేతల మధ్య ఎలాంటి లొల్లి లేకపోవడం అంత సద్దుమణిగిందని అంత భావించారు. కానీ నిన్న మరోసారి నేతల మధ్య లొల్లి తారాస్థాయికి చేరింది. దరఖాస్తుల పరిశీలన కోసం మంగళవారం గాంధీభవన్‌లో జరిగిన ఎన్నికల కమిటీ భేటీ రచ్చ రచ్చ అయింది. సీనియర్‌ నేతల మధ్య మాటల యుద్ధం జరిగినట్టు తెలుస్తుంది. మరీ ముఖ్యంగా రేవంత్‌, ఉత్తమ్‌కుమార్‌ సవాళ్లు, ప్రతిసవాళ్లు విసురుకున్నట్టు సమాచారం.

ఒకే కుటుంబానికి రెండు టికెట్లపై వీరిద్దరి మధ్య తీవ్రస్థాయిలో వాగ్వివాదం జరిగినట్టు తెలిసింది. ఉత్తమ్‌, ఆయన భార్య పద్మావతి రెండు సీట్ల కోసం దరఖాస్తు చేసుకోగా, దీనిపై స్పష్టత ఇవ్వాలని మహేశ్‌గౌడ్‌ కోరారు. స్పందించిన ఉత్తమ్‌.. దీనిపై ఇప్పుడు చర్చ ఎందుకని, ఎవరిని టార్గెట్‌ చేస్తూ ఈ అంశాన్ని ప్రస్తావించారని ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలిసింది. జోక్యం చేసుకున్న రేవంత్‌రెడ్డి ఈ విషయాన్ని హైకమాండ్‌ చూసుకుంటుందని పేర్కొన్నారు. రేవంత్‌ వ్యాఖ్యలపై అభ్యంతరం వ్యక్తం చేసిన ఉత్తమ్‌.. పీసీసీ అధ్యక్షుడిగా దీనిపై అభిప్రాయం చెప్పాలని, హైకమాండ్‌కు సిఫారసు చేయాలని డిమాండ్‌ చేశారు. కల్పించుకున్న రేవంత్‌ టికెట్ల విషయంలో తనను డిక్టేట్‌ చేయొద్దని ఉత్తమ్‌కు వార్నింగ్‌ ఇచ్చినట్టు సమాచారం.