రామ్ చరణ్ సరసన ఛాన్స్ కొట్టేసిన సీత రామం బ్యూటీ

సీతారామం మూవీతో తెలుగు తెరకు పరిచమైన మృనాల్ ఠాకూర్..ఒకే ఒక సినిమాతో యావత్ తెలుగు ఆడియన్స్ ను కట్టిపడేసింది. హను రాఘవపూడి దర్శకత్వం లో దుల్కర్ సల్మాన్ హీరో గా తెరకెక్కిన సీతా రామం మూవీ తో తెలుగు సినీ ప్రేమికుల ను పలకరించింది. ఈ మూవీ లో మృణాల్ ఠాకూర్ నటనకు గాను ప్రేక్షకుల నుండి , విమర్శకు ల నుండి అద్భుతమైన ప్రశంసలు లభించాయి. ప్రస్తుతం మృనాల్ ఠాకూర్ తెలుగు లో బిజీ హీరోయిన్ అవుతుంది. ఇప్పటికే నాచురల్ స్టార్ నాని సరసన నటించే ఛాన్స్ కొట్టేయగా..ఇక ఇప్పుడు ఏకంగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సరసన నటించే ఛాన్స్ కొట్టేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

ఆర్ఆర్ఆర్ తో వరల్డ్ వైడ్ గా గుర్తింపు తెచ్చుకున్న రామ్ చరణ్ ..ప్రస్తుతం శంకర్ డైరెక్షన్లో ఓ పాన్ ఇండియా మూవీ చేస్తున్నాడు. ఇప్పటికే సగం పైగా షూటింగ్ పూర్తి కావొచ్చింది. దిల్ రాజు నిర్మాణంలో భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ మూవీ లో రామ్ చరణ్ డ్యూయల్ రోల్ చేస్తున్నాడు. థమన్ మ్యూజిక్ అందిస్తున్నాడు. ఈ సినిమా పూర్తి కాగానే ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు డైరెక్షన్లో చరణ్ ఓ సినిమా చేయబోతున్నాడు. ఈ చిత్రంలో హీరోయిన్ గా మృణాల్ ఠాకూర్ ను ఎంపిక చేసినట్లు తెలుస్తుంది. దీనిపై అతి త్వరలో అధికారిక ప్రకటన రానుందని అంటున్నారు. ఈ మూవీని మైత్రీ మూవీ మేకర్స్ సమర్పణలో నూతన నిర్మాత వెంకట సతీష్ కీలారు నిర్మించబోతున్నారు.