తెలంగాణ ప్రజలకు కెసిఆర్ సంజాయిషీ ఇవ్వాలి

ఇప్పటికే ఏపి ఎక్కువ నీళ్లు తీసుకెళ్తోంది

uttam kumar reddy
uttam kumar reddy

హైదరాబాద్‌: తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డిహైదరాబాద్ లోని గాంధీ భవన్ లో ఈరోజు నిరసన దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా ఉత్తమ్ మాట్లాడుతూ.. కృష్ణా నదీ జలాల విషయమై ఏపి సిఎం మాట్లాడుతున్నా తెలంగాణ సిఎం కెసిఆర్‌ నోరుమెదపట్లేదని విమర్శించారు. కెసిఆర్‌ తో మాట్లాడే ‘పోతిరెడ్డిపాడు’ పనులు మొదలు పెడుతున్నామని వైఎస్‌ఆర్‌సిపిలో కీలక నేత శ్రీకాంత్ రెడ్డి అన్న మాట వాస్తవమా? కాదా? ఈ విషయమై కెసిఆర్‌ స్పష్టంగా ఎందుకు పత్రికా ప్రకటన ఇవ్వలేదు? అని ప్రశ్నించారు. తెలంగాణ ప్రజలకు కెసిఆర్‌ సంజాయిషీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ‘పోతిరెడ్డిపాడు’ సామర్థ్యం పెంచితే మహబూబ్ నగర్, నల్గొండ జిల్లాలు ఎడారిగా మారిపోతాయంటూ ధ్వజమెత్తారు. కాగా కృష్ణా జలాల్లో ఇప్పటికే ఏపీ ఎక్కువ నీళ్లు తీసుకెళ్తోందని ఉత్తమ్ కుమార్ రెడ్డి విమర్శించారు. ఈ దీక్షలో మహబూబ్ నగర్, రంగారెడ్డి, నల్గొండ జిల్లాల నాయకులు పాల్గొన్నారు.


తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/