కేసీఆర్‌తోనే నా ప్ర‌యాణం – బాజిరెడ్డి గోవ‌ర్ధ‌న్

తెలంగాణ లో బిఆర్ఎస్ పార్టీ కి వరుస షాకులు ఎదురవుతున్న సంగతి తెలిసిందే. పదేళ్ల పాటు కేసీఆర్ తో నడిచిన నేతలంతా ఇప్పుడు కాంగ్రెస్ వైపు నడుస్తున్నారు. మాజీ మంత్రులు , ఎమ్మెల్యేలు , బిఆర్ఎస్ ప్రభుత్వంలో కీలక పదవులు అనుభవించిన వారు ఇలా చాలామంది బిఆర్ఎస్ ను వీడుతూ వస్తున్నారు. ఈ తరుణంలో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవ‌ర్ధ‌న్ సైతం పార్టీ మారుతున్నట్లు ప్రచారం అవుతున్న నేపథ్యంలో వాటిపై క్లారిటీ ఇచ్చారు. తాను పార్టీ మార‌డం లేద‌ని చివ‌ర‌కు వ‌ర‌కు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌తోనే త‌న ప్ర‌యాణం కొన‌సాగుతోంద‌ని ఆయ‌న స్ప‌ష్టం చేశారు.

తాను కాంగ్రెస్ నాయ‌కుల‌తో ట‌చ్‌లో ఉన్న‌ట్లు నిజామాబాద్ టికెట్ ఆశిస్తున్న‌ట్లు కొన్ని టీవీ చానెల్స్‌లో ఫేక్ ప్ర‌చారం వ‌చ్చింది. ఆ వార్త త‌ప్పు.. దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ త‌న‌కు మూడు సార్లు టికెట్ ఇచ్చారు. త‌న నియోజ‌క‌వ‌ర్గ ప్ర‌జ‌లు రెండు సార్లు గెలిపించారు. మొన్న‌టి ఎన్నిక‌ల్లో ఓడిపోయినంత మాత్రాన పార్టీ మార‌డం అనేది స‌రికాదు. పార్టీ మారితే బీఆర్ఎస్‌కు ద్రోహం చేసిన వ్య‌క్తిని అవుతాను. టికెట్ వ‌చ్చినా, రాకున్నా కేసీఆర్ వెంటే త‌న ప్ర‌యాణం కొన‌సాగుతోంది. కుట్ర పూరితంగా కొంద‌రు కావాల‌ని దుష్ర్ప‌చారం చేస్తున్నారు. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను. రాజ‌కీయ ప్ర‌స్థానంలో త‌న‌కు లైఫ్ ఇచ్చిన వారికి ఇప్ప‌టి వ‌ర‌కు ద్రోహం చేయ‌లేదు. కాబ‌ట్టి బీఆర్ఎస్ పార్టీని వీడే ప్ర‌స‌క్తే లేదన్నారు.