సోషల్ మీడియాలో పీటర్సన్ డ్యాన్స్ వైరల్

‘జెంటిల్ మాన్’ చిత్రంలోని పాటకు డాన్స్

former England captain Kevin Pietersen

లాక్‌డౌన్ కారణంగా పలువురు క్రికెటర్స్   సంగీతాన్ని ఆస్వాదిస్తూ స్టెప్పులు వేస్తున్నారు.

ఇంగ్లండ్ మాజీ క్రికెట‌ర్ కెవిన్ పీట‌ర్స‌న్ కూడా తానేమి త‌క్కువ కాద‌న్న‌ట్టు సోష‌ల్ మీడియాలో రెచ్చిపోతున్నారు. 

పీట‌ర్స‌న్ చేసిన బుట్ట‌బొమ్మ డ్యాన్స్ ఇప్ప‌టికే  వైర‌ల్ కాగా, ఆయ‌న  ఒట్టగత్తి కట్టికో(తెలుగులో కొంటెగాణ్ణి ప‌ట్టుకో..) అనే పాటకి చేసిన డ్యాన్స్ సంగీత దిగ్గ‌జం ఏఆర్ రెహ‌మాన్‌ని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు .

జెంటిల్‌మ్యాన్ చిత్రం కోసం ఏఆర్ రెహ‌మాన్ ఈ స్వ‌రాలు స‌మ‌కూర్చ‌గా, ఈ పాట‌కి పీట‌ర్స‌న్ డ్యాన్స్ చేయ‌డాన్ని స్వాగ‌తించిన రెహ‌మాన్ త‌న ఇన్‌స్టాగ్రామ్ ద్వారా షేర్ చేశాడు.

వీడియోలో పీట‌ర్స‌న్ త‌న ఎక్స్‌ప్రెష‌న్స్‌తో నెటిజ‌న్స్‌కి ఫుల్ ఫ‌న్ అందించాడు.

తాజా స్వస్థ (ఆరోగ్యం జాగ్రత్తలు) కోసం : https://www.vaartha.com/specials/health/