ఆర్థిక ప్యాకేజీని వివరిస్తున్న నిర్మలా సీతారామన్
న్యూఢిల్లీ: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రధాని మోడి ఆర్థిక ప్యాకేజీని(ఆత్మ నిర్భర్ భారత్ ప్యాకేజీ) వివరిస్తున్నారు. ఆత్మ నిర్భర్ భారత్ అభియాన్‌ను ఐదు మూల సూత్రాలుగా విభజించాం. అవి ఆర్థిక, మౌలిక, సాంకేతిక, డెమోగ్రఫీ, డిమాండ్, భారత్ స్వయంపూర్వకంగా ఎదగడమే దీని లక్ష్యం స్థానిక ఉత్పత్తులను ప్రపంచవ్యాప్తంగా చేయడమే ఈప్యాకేజీ ప్రధాన ఉద్దేశం. ప్రధాని ఒక సమగ్రమైన దార్శినికతను దేశం ముందు ఉంచారని ఆమె అన్నారు. వివిధ స్థాయిలో సంప్రదింపుల అనంతరం ప్రధాని ఆర్థిక ప్యాకేజీ ప్రకటించారు. దేశ ఆర్థిక వృద్ధిని పెంచి స్వయం సమృద్ది భారత్ లక్ష్యంగా ప్యాకేజీని తీసుకొచ్చాం అని నిర్మలా సీతారామన్ తెలిపారు.
తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/telangana/