తెలంగాణ రాష్ట్ర గేయానికి ఏకగ్రీవంగా మద్దతు

తెలంగాణ రాష్ట్ర గేయానికి గ్రీన్ సిగ్నల్ పడింది. తెలంగాణ గీతం, ప్రభుత్వం అధికారిక ముద్రపై ఈ రోజు సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్ర సచివాలయంలో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి కాంగ్రెస్ మిత్రపక్ష పార్టీలతో పాటు ఎంఐఎం పాల్గోంది. అందేశ్రీ రచించిన తెలంగాణ గీతానికి ప్రముఖ సంగీత దర్శకుడు ఎమ్ ఎమ్ కీరవాణి సంగీతం అందించారు. ప్రముఖలు పాల్గొన్న ఈ సమావేశంలో కీరవాణి టీం రాష్ట్ర కొత్త గీతాన్ని పాడి వినిపించారు.

13 చరణాలతో ఉన్న పూర్తి గీతం నిడివి 13.30 నిమిషాలు ఉంటుందని ఆయన తెలిపారు. చరణాలు తగ్గించి రెండున్నర నిమిషాలతో రూపొందించిన గీతాన్ని కూడా ఆయన వినిపించారు. అయితే, ఈ రెండూ కూడా బాగున్నాయంటూ నేతలు చెప్పారు. కొమురం భీం, ముఖ్ధూం మొహినుద్దీన్, షేక్ బందగీ వంటి తెలంగాణ యోధుల పేర్లను కూడా ఆ గీతంలో చేర్చాలని వారు సూచించారు. దీంతో సీఎం మాట్లాడుతూ.. ఆ దిశగా పరిశీలించారంటూ అందెశ్రీకి సీఎం సూచించారు.