లాక్ డౌన్ పొడిగించేందుకే సిఎంల ఆసక్తి
క్షేత్రస్థాయి పరిస్థితుల మదింపు తరువాతే తుది నిర్ణయం

న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్రమోడి ఈరోజు రాష్ట్రాల సిఎంలతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడి లాక్డౌన్పై వారిందరి అభిప్రాయాలనూ అడిగి తెలుసుకున్నారు. అయితే లాక్ డౌన్ ను మే 3 తరువాత పొడిగింపునకే సిఎంలు ఆసక్తి చూపారని తెలుస్తోంది. అంతేకాక కొన్ని నిబంధనల సడలింపులు కూడా ఉంటాయని తెలుస్తోంది. ఈ సమావేశంలో 9 మంది ముఖ్యమంత్రులు ప్రధానితో లాక్ డౌన్ పై తమ అభిప్రాయాలు పంచుకున్నారని తెలుస్తోంది. వీరిలో అత్యధిక మంది సిఎంలు లాక్ డౌన్ ను పొడిగించాలని, అయితే, నిత్యావసరాలతో పాటు మరిన్ని విభాగాలను అనుమతించాలని సూచించినట్టు తెలుస్తోంది. అందరి అభిప్రాయాలనూ తీసుకున్న నరేంద్ర మోడి , కేంద్ర మంత్రులు, పలు నగరాల్లో క్షేత్ర స్థాయిలో పరిస్థితులను మదింపు చేసిన కేంద్ర బృందాల అభిప్రాయాలను తీసుకున్న తరువాత తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్టు అధికార వర్గాలు వెల్లడించాయి.
తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/news/international-news/