తెలంగాణ లో ఈ ఐదు రోజులు ఎండలే ఎండలు

తెలంగాణ లో గత కొద్దీ రోజులుగా ఎండలు దంచికొడుతున్న సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు రానున్న ఈ 5 రోజులు మరింత గా ఉండబోతాయని వాతావరణ శాఖ తెలిపింది. ప్రస్తుతం రికార్డవుతున్న టెంపరేచర్ల కంటే 2 నుంచి 3 డిగ్రీలు పెరిగే అవకాశం ఉందని తెలిపింది. ఎండలపై ఇప్పటికే అన్ని జిల్లాలకు ఎల్లో అలర్ట్‌ను జారీ చేశామని చెప్పింది.

హైదరాబాద్‌లోనూ వచ్చే 5 రోజులు ఎండల ప్రభావం తీవ్రంగా ఉంటుందని చెప్పింది. అయితే ఉదయం పూట మాత్రం పొగ మంచు పరిస్థితులు ఉంటాయని వాతావరణ శాఖ తెలిపింది. కాగా, 21 జిల్లాల్లో 40 డిగ్రీలకు పైగా టెంపరేచర్లు రికార్డ్‌ కాగా, మిగతా జిల్లాల్లో 39 డిగ్రీలకు పైగా నమోదయ్యాయి. అత్యధికంగా నల్గొండ జిల్లా బుగ్గబావిగూడ, నిర్మల్ జిల్లాల్లో 41 డిగ్రీల చొప్పున టెంపరేచర్లు రికార్డయ్యాయి.