‘కేసీఆర్, కోలుకోవాలని ప్రార్థిస్తున్నా’

జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ వెల్లడి

'కేసీఆర్, కోలుకోవాలని ప్రార్థిస్తున్నా'
TS-CM-Kcr-Pawan-Kalyan

Hyderabad: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సత్వరమే కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నానని జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ అన్నారు. సీఎం కేసీఆర్ ఆరోగ్యంగా ప్రజాసేవలో నిమగ్నం కావాలని దైవాన్ని ప్రార్థిస్తున్నానన్నారు. వారికి కోవిడ్ స్వల్ప లక్షణాలే ఉన్నాయనీ, ఎలాంటి ఇబ్బందీ లేదని వైద్యులు చెప్పడం తెలంగాణ ప్రజలందరికీ ఊరట కలిగిస్తోందిన్నారు. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ త్వరగా కోలుకుని, ఆరోగ్యవంతులు కావాలని దైవాన్ని ప్రార్థిస్తున్నానని పవన్ పేర్కొన్నారు.

తాజా బిజినెస్‌ వార్తల కోసం: https://www.vaartha.com/news/business/