ఏపీ గవర్నర్ కు అస్వస్థత

ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్ అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయనను మణిపాల్ ఆసుపత్రికి తరలించారు. మణిపాల్ ఆసుపత్రిలో గవర్నర్ అబ్దుల్ నజీర్ కు వైద్యులు పరీక్షలు నిర్వహించారు. ఆయన ప్రస్తుతం మణిపాల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

గవర్నర్‌ అబ్దుల్‌ నాజిర్‌కు వైద్య పరీక్షలు చేసి.. ఎండోస్కోపీ నిర్వహించాలని వైద్యులు సూచించినట్లు తెలుస్తోంది. గవర్నర్‌ ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగానే ఉన్నట్లు తెలుస్తోంది. కాగా, ఉన్నట్టుండి గవర్నర్‌ అనారోగ్యానికి గురి కావడానికి గల కారణాలు మాత్రం తెలియరాలేదు. దీనిపై ఏపీ రాజ్‌భవన్‌ కూడా ఎలాంటి ప్రకటన చేయలేదు.