‘బ్యాండేజ్’ తీశాక బయల్పడిన జగన్నాటకం..

మంగళగిరి రచ్చబండ సభలో నారా లోకేష్

Nara Lokesh speaking at Ratchabanda Sabha in Mangalagiri on Saturday night

Amaravati: జగన్ రెడ్డి తనకు తగిలిన గులకరాయి గాయంపై బ్యాండేజ్ తీసేస్తే ఎలాంటి మచ్చా లేదని దీంతో ఆయన నటన ప్రజలకు అర్థమైందని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పేర్కొన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళగిరి ఇందిరానగర్ లో శనివారం రాత్రి నిర్వహించిన రచ్చబండ సభలో లోకేష్ మాట్లాడుతూ.. జగన్ పై పడిన స్పెషల్ గులకరాయి… జగన్ కు తగిలి అటు నుంచి తొలుత వెల్లంపల్లి కుడికన్ను, ఆపై ఎడమ కన్నుకు తగిలింది. 2019లో కోడికత్తి శ్రీనుకు వైసీపీ నాయకులే డబ్బులిచ్చి పొడవమన్నారు. అతను ఐదేళ్ల పాటు జైలులో ఉన్నాడు. అప్పుడు బాబాయి శవం లేచింది. ఇప్పుడు గులకరాయితో దాడి చేయించుకున్నారని , ఎవరి శవం లేస్తుందో? అని అన్నారు. జగన్ కు శవ రాజకీయాలంటే ఇష్టమని , 2014లో తండ్రి శవంతో రాజకీయం ,. 2019లో సొంత బాబాయిని చంపి, ఆ నెపం చంద్రబాబునాయుడుపై నెట్టి ఎన్నికల్లో లబ్ధిపొందారని
అన్నారు. ఇప్పుడు 1వ తేదీనే పెన్షన్ ఇవ్వకుండా 32 మంది వృద్ధులను చంపి శవ రాజకీయం చేస్తున్నారని , సొంత చెల్లెలు షర్మిల పసుపు చీర ధరిస్తే టీడీపీ అంటున్నారని తెలిపారు. తల్లి, భార్య కూడా పసుపు చీర కట్టుకున్నారు కదా, వారిని ఏమంటారో ? అని ప్రశ్నించారు. సొంత తల్లి, చెల్లికే న్యాయం చేయనివారు ప్రజలకేం న్యాయం చేస్తారని లోకేష్ ప్రశ్నించారు.

People attending the Lokesh Sabha

ఇందిరానగర్ వాసులు తమ సమస్యలను లోకేష్ దృష్టికి తీసుకువచ్చారు. ఇళ్లులేని వారికి నిర్మించి ఇవ్వాలి. రోడ్లు నిర్మించాలని , నియోజకవర్గంలో ఉన్న స్టేడియం అభివృద్ధికి చర్యలు తీసుకోవాలని , తాగునీరు అందించాలి, వీధి లైట్లు ఏర్పాటుచేయాలని , మంగళగిరిలో ఐటీ పరిశ్రమలు తీసుకురావాలని . చదువుకున్న యువతకు ఉద్యోగాలు కల్పించాలని కోరారు. దీనికి లోకేష్ స్పందిస్తూ.. ఇళ్లులేని నిరుపేదలకు ఇళ్లు నిర్మించి ఇస్తామని చెప్పారు. . స్టేడియం పనులు పూర్తిచేసి మౌలిక వసతులు కల్పిస్తామని, భూగర్భ డ్రైనేజీ నిర్మాణంతో పాటు ప్రతి ఇంటికి కుళాయి ద్వారా సురక్షితమైన తాగునీరు అందిస్తామని తెలిపారు. వీధి లైట్లు ఏర్పాటు చేయిస్తామని , పరిశ్రమలు తీసుకువచ్చి స్థానిక యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. మంగళగిరి ప్రజలను నా సొంతం చేసుకుని 29 అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేపట్టా. ప్రజలకు సేవ చేయాలని అహర్నిశలు కష్టపడ్డానని లోకేష్ పేర్కొన్నారు.